Home  »  TV News  »  స్వప్న జ్ఞాపకాలని కాల్చేసిన కృష్ణమూర్తి!

Updated : Apr 19, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-73లో.. కనకం‌ ఇంటికి వెళ్ళివచ్చిన అపర్ణ.. ‌అక్కడ తనకి జరిగిన అవమానం గురించి, రాజ్ మాట్లాడిన విధానం గురించి సీతారామయ్య  మరియు ఇతర కుటుంబ సభ్యులతో చెప్తూ బాధపడుతుంది. రాజ్ ని మార్చేసారని.. దీనికి ఎలా సపోర్ట్ చేస్తారని వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది అపర్ణ. కావ్య‌ నువ్వు ఇక్కడికి వచ్చాక నిన్ను ఏం చేస్తానో చూడని తన మనసులో అనుకుంటుంది అపర్ణ. 

మరోవైపు కనకం దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్తే తను అర్థం చేసుకుంటుందని భావించిన స్వప్న వాళ్ళింటికి వెళ్తుంది‌. ఎవరైనా చూస్తారేమోనని దొంగచాటుగా వెళ్ళగా.. వాళ్ళ చెల్లి కావ్య చూస్తుంది.. కలా నిజమా అని కావ్య కనులు మూసి తెరిచేలోగా దాక్కుంటుంది స్వప్న. ఆ తర్వాత మెల్లిగా ఇంట్లోకి వస్తుంది స్వప్న. తన జ్లాపకాలను అన్నింటిని పడేయడానికి ఇంట్లో ఒక మూలన పడేయడంతో అవి చూసిన స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కనకం నిద్రపట్టట్లేదని సోఫాలోకి వస్తుంది. ఏమైంది కనకం పడుకోకుండా ఇలా వచ్చావేంటని కృష్ణమూర్తి అడుగగా.. ఆ సచ్చిన స్వప్న వచ్చినట్టుగా కల వచ్చిందని కనకం అంటుంది. ఆ పాపిష్టి దానిని ఎందుకు తల్చుకున్నావని కృష్ణమూర్తి అంటాడు. పక్కనే దాక్కున్న స్వప్న ఈ మాటలు విని.. వీళ్ళు నన్ను ఇంతలా అసహ్యించుకుంటున్నారా అనుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఇంట్లోని స్వప్న వస్తువులను, ఫోటోని చూసిన కృష్ణమూర్తి.. వాటిని బయటకు తీసుకెళ్ళి కిరోసిన్ పోసి కాల్చేస్తాడు. దూరం నుండి అది చూస్తూ స్వప్న ఏడుస్తుంది.

కాసేపటికి రాజ్ గదిలోకి వెళ్ళిన కావ్య.. గడియ పెట్టి రాజ్ దగ్గరగా వస్తుంది. అలా కావ్య రావడం చూసి‌న రాజ్.. భాయపడుతూ.. ఏయ్ ఏంటి.. ఆ గడియ ఎందుకు పెట్టావ్? ఏం చేయాలనుకుంటున్నావ్? ఆ పప్పులేం నా దగ్గర ఉడకవని రాజ్ అంటాడు. మీరు సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆపారు కదా విసరడానికి విసనకర్ర తీసుకొచ్చానని కావ్య అంటుంది. కాసేపు విసిరాక రాజ్ పడుకుంటాడు. కావ్య నేలమీద పడుకుంటుంది. కాసేపటికి రాజ్ లేచి చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.